సిరివెన్నెలకు తీవ్ర అస్వస్థత.. క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు..!

Published on Nov 27, 2021 9:47 pm IST


ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, రెండు రోజుల నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను తాజాగా కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారని, ప్రస్తుతం సిరివెన్నెలకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి.

అయితే ఈ వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు న్యుమోనియాతో ఇబ్బంది పడుతుండడంతోనే ఆసుపత్రిలో జాయిన్ చేశామని, ఇది రెగ్యులర్ చెకప్‌లో భాగమేనని, తీవ్ర అస్వస్థత పరిస్థితుల్లో లేరని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

సంబంధిత సమాచారం :