ఫ్యామిలీతో అల్లరి చేస్తున్న ‘సుప్రీమ్’

Supreme
‘పిల్లా నువ్వులేని జీవితం’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తోనే సుప్రీమ్ హీరోగా ట్యాగ్ లైన్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ తన తదుపరి సినిమాకి కూడా ‘సుప్రీమ్’ అదే టైటిల్ ని ఫిక్స్ చేసాడు. ఈ ఏడాది పటాస్ తో సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్ లో భాగంగా ఓ హౌస్ సెట్లో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ చిత్ర టీం దీపావళి రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ స్పాట్ లోనే దీపావళి జరుపుకొని షూటింగ్ ని కొనసాగించారు. సాయి ధరమ్ తేజ్ అతని ఫ్యామిలీతో కలిసి చేస్తున్న ఈ సీన్స్ షూటింగ్లో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా పాల్గొంటోంది. రాశీ ఖన్నా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఓ టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. దిల్ రాజు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది.

Exit mobile version