విస్మరించబడుతున్న కుటుంబ విలువలను ‘ఫ్యామిలీ స్టార్’ గుర్తు చేస్తుంది – కెమెరా మ్యాన్ కెయు మోహనన్

విస్మరించబడుతున్న కుటుంబ విలువలను ‘ఫ్యామిలీ స్టార్’ గుర్తు చేస్తుంది – కెమెరా మ్యాన్ కెయు మోహనన్

Published on Mar 28, 2024 2:02 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. దీనిని పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్,టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా కెమెరా మ్యాన్ కెయు మోహనన్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో విస్మరించబడుతున్న కుటుంబ విలువల గురించి ఫ్యామిలీ స్టార్ మూవీలో చూపించడం జరిగిందని అన్నారు. విజయ్ దేవరకొండ సహజమైన నటుడని, సినిమాలో అతని నటన తనకు బాగా నచ్చిందని అన్నారు. షూటింగ్ మొత్తంలో దర్శకుడు పరశురామ్, నటి మృణాల్ ఠాకూర్ తనకు చాలా మద్దతు ఇచ్చారని, మొత్తంగా మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అనంతరం మంచి విజయం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు మోహనన్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు