“ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!

“ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!

Published on Mar 27, 2024 7:31 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family star). మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. రేపు ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ను వెల్లడించారు మేకర్స్. రేపు ఉదయం 11:07 గంటలకి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు