రజినీతో నటించనున్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ !

రజినీతో నటించనున్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ !

Published on Jul 18, 2018 8:00 PM IST

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఇటీవల డార్జిలింగ్ లో చిత్రీకరించారు. అతి త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఫహద్ ఫాసిల్. విజయ్ సేతుపతి , బాబీ సింహ వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈచిత్రంలో తాజాగా మరో ఇద్దరు జాయిన్ కానున్నారు. సీనియర్ సౌత్ హీరోయిన్ సిమ్రాన్ తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకులముందుకు రానుంది. ఇక తలైవా రజినీ ఈ చిత్ర షూటింగ్ ను త్వరగా ముగించి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారాలని భావిస్తున్నారట. ఆయనకు ఈ చిత్రమే చివరిది కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు