చేసిన మేలుకు ఆర్ఆర్ఆర్ టికెట్స్ కావాలి… ఎన్టీఆర్ ఫ్యాన్ సంచలన పోస్ట్!

Published on Jan 24, 2021 2:44 pm IST

స్టార్ హీరోల అభిమానుల చర్యలు ఒక్కోసారి ఆశ్చర్యం గొలుపుతాయి. తమ వీరాభిమానం నిరూపించుకునే క్రమంలో చేసే చేష్టలు సదరు హీరోలకే షాక్ ఇస్తాయి. తాజాగా ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఇలాగే వింత పని చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కారు ఓవర్ స్పీడ్ తో వెళ్లిన కారణంగా హైదరాబాద్ పోలీసులు ఫైన్ వేశారు. ఎన్టీఆర్ రూ. 1035 ఫైన్ చెల్లించాలంటూ చలానా రాయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని ఎన్టీఆర్ కట్టాల్సిన ఫైన్ స్వయంగా చెల్లించాడు. అయితే దానికి ప్రత్యుపకారం ఎన్టీఆర్ ని కోరడం జరిగింది.

ఫైన్ అమౌంట్ చెల్లించి నందుకు గాను, తనకు ఆర్ ఆర్ ఆర్ టికెట్స్ కావాలని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అది కూడా తనకు ఇష్టమమైన మల్లికార్జున లేదా భ్రమరాంబ థియేటర్స్ టికెట్స్ ఇప్పించాలని విన్నవించుకున్నాడు. ఎన్టీఆర్ అభిమాని సోషల్ మీడియా పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో పాటు, అతడు ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఎన్టీఆర్ కట్టాల్సిన చలానా తాను కట్టడమే విశేషమైతే.. దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఆర్ ఆర్ ఆర్ టికెట్స్ అడగడంతో అందరూ షాక్ అయ్యారు. మరి సదరు అభిమాని కోరిక ఎన్టీఆర్ వరకు చేరిందో లేదో తెలియదు.

సంబంధిత సమాచారం :