మన హీరోలను చూసి తమిళ స్టార్స్ నేర్చుకోవాలి

Published on Aug 10, 2019 7:32 am IST

కోలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోస్ అభిమానుల మధ్యన బీభత్సమైన ఫ్యాన్ వార్ నడుస్తుంది. హీరో విజయ్ మరియు అజిత్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం విజయ్ చనిపోయాడంటూ యాష్ ట్యాగ్ తో అజయ్ ఫ్యాన్స్ ఓ వార్తను వైరల్ చేయగా, తాజాగా విజయ్ ఫ్యాన్ ఒకరు అజిత్ ఫ్యాన్ పై కత్తితో దాడి చేయడం జరిగింది.

ఐతే ఇంత జరుగుతున్నా ఈ హీరోలు మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. వాళ్లిద్దరూ చొరవ తీసుకోవడం వలన వారిలో కొద్ది మార్పువచ్చే ఆవకాశం కలదు.

ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు కోలీవుడ్ హీరోలకు చాలా స్ఫూర్తి దాయకం అని చెప్పొచ్చు.ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ వంటి హీరోలు కలిసి ఒకే వేడుకలపై సందడి చేస్తున్నారు. ఆ మధ్య మహేష్ ఎన్టీఆర్ ఓ చిత్ర వేడుక కార్యక్రమంలోపాల్గొని ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపించుకున్నారు.ఆ సందర్బంలో మహేష్ ఓపెన్ మేము బాగానే ఉంటాం, ఫ్యాన్స్ మీరెందుకు కొట్టుకుంటారు అని ప్రశ్నించడం జరిగింది.

ఇక మహేష్, ఎన్టీఆర్ లతో చరణ్ చాలా సన్నిహితంగా ఉంటారు.వీరు ముగ్గురు కుటుంబ సమేతంగా అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.ప్రభాస్ గురించి చెప్పాలంటే నిగర్వి, చిన్న, పెద్ద హీరోలనే భేదం లేకుండా అందరితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు.ముఖ్యంగా బన్నీ, ప్రభాస్ మంచి మిత్రులు అని చెప్పాలి. గతంలో కంటే టాలీవుడ్ లో ఫ్యాన్ వార్ లు చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్పవచ్చు.నాని ప్రభాస్ మూవీని ఉద్దేశిస్తూ ఈ మూవీ మాది, ప్రభాస్ అన్న సాహో భారీ విజయం సాధించాలని ట్వీట్ చేయడం గమనార్హం.

మరి కోలీవుడ్ స్టార్ హీరోలైన రజని, అజిత్, విజయ్, కమల్, విక్రమ్ లాంటి వారు ఈ దశగా ఎందుకు ఆలోచించడం లేదు అనేది ఆసక్తికరం.ఇప్పటికైనా ఈ విషయం పై ద్రుష్టి సారించకపోతే భవిష్యత్ లో మరిన్ని బాధాకర సంఘటనలను చవిచూడాల్సివస్తుంది.

సంబంధిత సమాచారం :