‘వకీల్ సాబ్’ శాటిలైట్ హక్కులను దక్కించుకున్నది వీరే

Published on Jan 14, 2021 1:31 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు ఇది తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సినిమా షూటింగ్ ముగిసింది. పవన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. అందుకే శాటిలైట్ హక్కులను భారీ డిమాండ్ ఏర్పడింది. మొదట ఈ హక్కులను జెమినీ టీవీ కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ ఏమైందో ఏమో ఆ ఛానెల్ వెనక్కు తగ్గింది.

ఫిలిం నగర్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 15 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయిందట. ఇకపోతే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ రేపు 14వ తేదీన 6:03 గంటలకు విడుదల కానుంది. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ నెలలో సినిమా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More