ఫ్యాన్స్ లో “టక్ జగదీష్” పై పెరుగుతున్న ఆసక్తి.!

Published on Jul 17, 2021 9:00 am IST

నాచురల్ స్టార్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “టక్ జగదీష్”. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నాని హిట్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొలుకున్న ఈ చిత్రం విడుదల కోసం సినీ వర్గాలు ముఖ్యంగా అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తుతుంది. అయితే గత కొన్ని రోజులు నుంచి ఇది మరింత ఎక్కువయ్యింది.

ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ ఈ జూలై 30 న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అని చాలా మంది ఫిక్స్ అయ్యిపోగా అభిమానుల్లో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ నెలకొంది. అందుకే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై అధికారిక క్లారిటీని కోరుకుంటున్నారు. మరి టక్ జగదీష్ రిలీజ్ డేట్ సస్పెన్స్ పై మేకర్స్ ఏదన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ సాలిడ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ కి థమన్ సంగీతం అందివ్వగా షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :