పెద్ది : కొత్త సీన్స్ పై అభిమానుల్లో అయోమయం..!

పెద్ది : కొత్త సీన్స్ పై అభిమానుల్లో అయోమయం..!

Published on Jun 17, 2026 6:59 AM IST

Peddii

రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పెద్ది’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. అయితే, బుధవారం (ఈరోజు) నుండి సినిమాకు కొన్ని కొత్త సీన్లు జోడిస్తున్నట్లు ఇటీవల ఒక ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రకటించారు.

ఈ అదనపు ఫుటేజ్‌ను థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, డైరెక్టర్ ప్రకటన చేసినప్పటికీ నిర్మాణ సంస్థ (వృద్ధి సినిమాస్) నుండి ఎలాంటి అధికారిక సోషల్ మీడియా పోస్ట్ రాలేదు. దీంతో ఆ సీన్లు నిజంగానే యాడ్ అయ్యాయా లేదా వాయిదా పడ్డాయా అనే విషయంలో అభిమానుల్లో అయోమయం నెలకొంది.

ప్రస్తుతానికి ఈరోజు మార్నింగ్ షోలు చూసిన ప్రేక్షకుల టాక్ లేదా మేకర్స్ ఇచ్చే అప్‌డేట్ కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు