‘సాహో’ టీజర్లో ఏమేం ఉండాలంటే..

Published on Jun 11, 2019 11:29 pm IST

సుమారు 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న చిత్రం ‘సాహో’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్ జూన్ 14న విడుదలకానుంది. దీనిపై ఫ్యాన్స్, ఆడియన్స్ చాలా అంచనాలే పెట్టుకున్నారు. టీజర్ పలానా విధంగా ఉండాలి అంటూ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ వారికి సోషల్ మీడియా వేదికగా కండిషన్స్ సైతం పెడుతున్నారు.

వాళ్ళ కండీషన్స్ మేరకు సినిమా హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి టీజర్లో యాక్షన్ సన్నివేశాల తాలూకు ఛాయలు స్పష్టంగా కనబడాలట, అవి కూడా ఇంటర్నేషనల్ లెవల్లో ఉండాలట. ఇక ప్రధానంగా హీరోగా ప్రభాస్ పాత్ర వీర లెవల్లో ఎలివేట్ కావాలట. అంతేకాదు మరీ ముఖ్యంగా రెబల్ స్టార్ స్టైల్, యాటిట్యూడ్ కొత్తగా కనబడాలని, మధ్యలో రెండు మూడు పవర్ఫుల్ డైలాగ్స్ కూడా పడాలని, మొత్తం మీద నభూతో నభవిష్యత్ అనేలా టీజర్ ఉండాలని అంటున్నారు. మరి చూడాలి ఆకాశాన్ని తాకున్న వీరి అంచనాలను సుజీత్ అండ్ టీమ్ ఎంతవరకు అందుకుంటారో.

సంబంధిత సమాచారం :

More