ఆ ఐదుగురు మహేష్ ని కలవనున్నారు.

Published on Aug 6, 2019 1:46 pm IST

ప్రిన్స్ మహేష్ ది హంబుల్ కో బ్రాండ్ నేమ్ తో గార్మెంట్ బిజినెస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందు మహేష్ టీమ్ ఓ ఆసక్తికర కాంటెస్ట్ నిర్వహించింది. మూడురోజుల కౌంట్ డౌన్ తో ఫ్యాన్స్ ని మహేష్ చేయనున్న బిజినెస్ గెస్ చేయండి అని ఓ పజిల్ నిర్వహించగా,దానికి స్పందించిన లక్షలాది మంది మహేష్ ఫ్యాన్స్ సమాధాలు ట్యాగ్ చేసిపంపడం జరిగింది.

కాగా వారిలో లక్కీ డిప్ ద్వారా ఐదుగురు అదృష్టవంతులకు మహేష్ ని కలిసే అవకాశం దక్కింది. కొద్దిసేపటి క్రితం ది హంబుల్ కో టీం వారి పేర్లు ప్రకటించడం జరిగింది. సుధీర్ కుమార్ 33992,డి రాజేష్ రెడ్డి, మహేష్ నంబూరి, అంజలి ఓరుగంటి, అశోక్ శ్రీశైలపు అను పేరు గల ఐదుగురు మహేష్ అభిమానులు ఆయనని కలిసే అదృష్టం పొందారు. రేపు ది హంబుల్ కో బ్రాండ్ ఘనంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో మహేష్ వీరిని కలిసే అవకాశం కలదు.

కాగా ఇంకా మూడు రోజులలో మహేష్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంపై ఎటువంటి అప్డేట్ ఇస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :