చేసిన తప్పుకు చింతిస్తున్న అజిత్

Published on Jun 13, 2019 10:24 am IST

దక్షిణాది కథానాయకుల్లో అజిత్ వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ఏనాడు ప్రచారం కోసం తపించని ఆయనలో సమాజానికి అవసరమైన ఆదర్శాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల ఆయన చూపే గౌరవం చాలా గొప్పది. ఆయనతో కలిసి పనిచేసిన చాలామంది నటీమణులు ఈ సంగతిని చెప్పగా అందుకు నిదర్శనంగా ఇంకో సంఘటన కూడా జరిగింది.

అజిత్ ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ ‘పింక్’ యొక్క తమిళ రీమేక్ ‘నెర్కొండ పార్వై’లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ నిన్నే విడుదలైంది. ఈ సందర్బంగా అజిత్ మాట్లాడుతూ నా కెరీర్ ఆరంభంలో మహిళల పాత్రల్ని ఇబ్బందిపెట్టే తరహా పాత్రలు చేశాను. ఆ తప్పుకు ఇప్పుడు చింతిస్తున్నాను. ఆ తప్పును సరిదిద్దుకుని, మహిళల్ని గౌరవించే పాత్రలో ఆదర్శంగా నిలవడానికి ఈ ‘నెర్కొండ పార్వై’ చిత్రం చేస్తున్నాను అన్నారు. అజిత్ ఇంత బాహాటంగా తన పొరపాటుని ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుండటంతో అభిమానుల్లో ఆయనపై గౌరవం మరింతగా పెరిగింది.

సంబంధిత సమాచారం :

More