‘అరవింద సమేత’ టైటిల్ వెనకున్న రహస్యం ఏమిటి ?

Published on Jul 3, 2018 1:26 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూతన చిత్రం ‘అరవింద సమేత’. త్రివిక్రమ్ చూజ్ చేసుకున్న ఈ టైటిల్ సినిమాపై బోలెడంత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. టైటిల్ బయటికొచ్చాక అభిమానులు చాలా మంది ఆ టైటిల్ వెనకున్న అసలు లాజిక్ ను ఛేదించాలని ప్రయత్నిస్తున్నారు. కొందరేమో అరవింద అనేది హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర పేరని, వీర రాఘవ అనేది ఎన్టీఆర్ పాత్ర పేరని అన్నారు.

ఇంకొంతమంది ఇంకో అడుగు ముందుకేసి అరవింద అనేది ఎన్టీఆర్ లోని సాఫ్ట్ క్యారెక్టర్ పేరని, వీర రాఘవ అనేది రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉండే సాగే ఎన్టీఆర్ యొక్క మాస్ షేడ్ యొక్క పేరని విశ్లేషణ ఇచ్చారు. కానీ టైటిల్ రహస్యం అది కూడ కాదని చిత్ర సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. దీంతో అభిమానులు మరోసారి ఆలోచనలో పడి ఆ లాజిక్ ను ఛేదించే పని మొదలుపెట్టారు. ఇంతకీ ఆ లాజిక్ ఏంటో తెలియాలంటే త్రివిక్రమ్ లేదా తారక్ లలో ఎవరో ఒకరు నోరు విప్పే వరకు ఆగాల్సిందే.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ సినిమాను ఆగష్టు నెలలో విడుదల చేయాలనే ఆలోచన ఉన్నారు టీమ్. ఈ చిత్రంలో తారక్ సిక్స్ ప్యాక్ లుక్ తో అలరించనున్నాడు.

సంబంధిత సమాచారం :