
ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన యంగ్ హీరో ఉదయ్ కిరణ్ స్వర్గస్తులైన సంగతి అందరికీ తెలిసిందే. ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా ‘చిత్రమ్ చెప్పిన కథ’. ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. కానీ తాజాగా సిటీ సివిల్స్ కోర్టు ఈ సినిమా రిలీజ్ ని ఆపేయాలని చెప్పడంతో ఉదయ్ కిరణ్ అభిమానులు బాధపడుతున్నారు. ఈ సినిమాని ఉదయ్ కిరణ్ రెండవ పుట్టిన రోజు సంవత్సరికం కారణంగా ఈ రోజు రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ సడన్ గా వాయిదా పడింది.
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడడం అభిమానులను బాధ పెట్టింది. ఉదయ్ కిరణ్ మేనేజర్ మున్న నిర్మించిన ఈ సినిమాకి మోహన్ దర్శకుడు. ఈ సినిమాలో నువ్వు నేను ఫేం అనిత కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఉదయ్ చనిపోయాడు. మరి ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

