ప్రభాస్ అలాంటి సినిమా చేయాలట !

ప్రభాస్ అలాంటి సినిమా చేయాలట !

Published on Mar 29, 2020 10:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ కి ముందు నుండి మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా బాహుబ‌లి సిరీస్ అండ్ ‘సాహో’ చిత్రాలతో నేషనల్ స్టార్ అయిపోయాడు రెబల్ స్టార్. తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు మిగిలిన ఇండస్ట్రీస్ లో కూడా తనకంటూ మాస్ జనాల్లో ఘనమైన స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు. మొత్తానికి ప్రభాస్ కి మాస్ ఇమేజ్ బాగా బిల్డ్ అయింది. కాగా ప్రభాస్ నుండి ఆయన ఫ్యాన్స్ పక్కా మాస్ సినిమాని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా ఫార్ములాతో క్లాస్ ఫీల్ ఉన్న యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ సినిమా ‘సాహో’ అత్యున్నత సాంకేతికతో భారీగానే ఉన్నా పక్కా లోకల్ అనే ఫీలింగ్ కలగలేదు మాస్ ప్రేక్షకులకు. ఇక ప్రస్తుతం చేస్తున్నది కూడా అలాంటి క్లాస్ సినిమానే. అందుకే ప్రభాస్ పూర్తి మాస్ ఆడియన్స్ కోసం ఒక యాక్షన్ ఎంటెర్టైనర్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు