కొత్త అమ్మాయికి రవితేజ బంపర్ ఆఫర్ ?

Published on Mar 16, 2021 1:00 am IST

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్ల కొదవ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. చేసిన వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు హీరోలు. దీంతో కొత్తవారి కోసం వెతుకులాట స్టార్ట్ చేశారు. అడపాదడపా చిన్న సినిమాలతో కొత్త హీరోయిన్లు వస్తున్నా కూడ పెద్ద హీరోల దృష్టిని ఆకర్షించలేకపోతున్నారు. అలాంటిది కొన్నిరోజుల క్రితమే తెలుగు వెండి తెర మీద మెరిసిన అమ్మాయికి ఏకంగా రవితేజ నుండి ఆఫర్ వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆమె మరెవరో కాదు ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో పాటు ఫరియా నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆమె ఎత్తు అందరికీ షాకిచ్చింది. అందరి అమ్మాయిల్లా కాకుండా ఆల్ మోస్ట్ అనుష్క ఎత్తుకు దగ్గరగా ఉండటమే ఆమెకు కలిసొచ్చింది అంటున్నారు. ఆమెను చూసి తన తర్వాతి సినిమాకు సరిగ్గా సరిపోతుందని మాస్ మహారాజ్ భావించి నిర్మాతలకు ఆమె పేరును సజెస్ట్ చేశారట. ఇదే గనుక నిజమైతే ఫరియా అబ్దుల్లా ఫేట్ తిరిగిపోయినట్టే అనాలి.

సంబంధిత సమాచారం :