నైజాం ఏరియాలో మెగాహీరో దూకుడు !
Published on Jul 30, 2017 12:45 pm IST


మెగాహీరో వరుణ్ తేజ్ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ను ‘ఫిదా’ తో అందుకున్నాడు. కమర్షియల్ సక్సెస్ తో పాటు నటుడిగా కూడా ఈ చిత్రం వరుణ్ తేజ్ కు బాగా కలిసొచ్చింది. వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఈ చిత్రం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం మెగా హీరోలకు మంచి పట్టుకున్న నైజాం ఏరియాలో 9 రోజులకు కలిపి రూ . 9.45 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఈరోజుటితో రూ. 10 కోట్ల మార్కును అందుకోనుంది.

అలాగే యూఎస్ లో సైతమ్ సినిమాకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వారాంతంలో వసూళ్లు మరింతగా పుంజుకుంటున్నాయి. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లకు దగ్గరైన ఈ చిత్రం త్వరలోనే 2 మిలియన్లు దాటిపోనుంది. ఇక అన్ని ఏరియల్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల దిశగా వెళుతున్నారు కూడ. ఇక ఈ చిత్రంతో హీరోయిన్ సాయి పల్లవి తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుండగా వరుణ్ తేజ్ రెట్టించిన ఉత్సాహంతో తనకు తగిన కథలను ఎంచుకునే పనిలో ఉన్నారు.

 
Like us on Facebook