ఓవర్సీస్లో మెగా హీరో దూకుడు !
Published on Jul 23, 2017 12:07 pm IST


మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఫిదా’ గత శుక్రవారం విడుదలై మొదటి షో నుండే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా నడుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల చాన్నాళ్ల తర్వాత డైరెక్ట్ చేసిన ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఓవర్సీస్లో సైతం మంచి జోరు కనబరుస్తోంది. మొదటిరోజు శుక్రవారం 3.6 లక్షల డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా శనివారం 3 లక్షల డాలర్లను రాబట్టుకుని హాఫ్ మిలియన్ క్రాస్ చేసేసింది.

ఇక ఈరోజు శనివారం కావడం, ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ఉండటంతో ఈ చిత్రం లాంగ్ రన్లో మొత్తం 2 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సాయి పల్లవి, వరుణ్ తేజ్ ల నటన, శేఖర్ కమ్ముల టేకింగ్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచి వరుణ్ తేజ్ ఖాతాలో మంచి కమర్షియల్ పడేలా చేశాయి. అంతేగాక ఈ చిత్ర విజయంతో ఓవర్సీస్లో సైతం వరుణ్ తేజ్ కు మార్కెట్ క్రియేట్ అయింది.

 
Like us on Facebook