కరోనా సహాయార్థం.. ఏ స్టార్ ఎంత ఇచ్చాడు !

Published on Mar 26, 2020 5:39 pm IST

కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 21,295 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో కూడా ఇప్పటి వరకూ 600లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం దేశం మొత్తాన్ని 21 రోజుల పాటు లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఎవరు ఎంత విరాళంగా ప్రకటించారో చూద్దాం.

పవన్ కళ్యాణ్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున మరియు కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయిలు చొప్పున మొత్తం 2 కోట్లు
మహేష్ బాబు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున – మొత్తం కోటి రూపాయలు
ప్రభాస్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున – మొత్తం కోటి రూపాయలు
చిరంజీవి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున – మొత్తం కోటి రూపాయలు
రామ్ చరణ్ కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సహాయ నిధికి ఇచ్చిన మొత్తం రూ. 70 లక్షలు
నితిన్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున – మొత్తం రూ. 20 లక్షలు
త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున – మొత్తం రూ. 20 లక్షలు
దిల్ రాజు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున – మొత్తం రూ. 20 లక్షలు
అనిల్‌ రావిపూడి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు
సాయి ధరమ్ తేజ్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు
కొరటాల శివ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు
వినాయక్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మొత్తంగా రూ. 5 లక్షలు
ఎన్టీఆర్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున మరియు సినీ కార్మికుల సహాయార్ధం కోసం మరో 25 లక్షలు చొప్పున మొత్తం రూ. 75 లక్షలు

సంబంధిత సమాచారం :

X
More