రాజశేఖర్ కోసం సినీ ప్రముఖుల ప్రార్థనలు

Published on Oct 23, 2020 1:08 am IST

ప్రముఖ నటుడు డా.రాజశేఖర్ కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఉదయం నుండి ఆయన ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరంగా ఉంది అంటూ ప్రచారం మొదలైంది. వెంటనే స్పందించిన ఆయన కుమార్తె శివాత్మిక తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, అనవసరంగా ఫేక్ వార్తలు ప్రచారం చేయవద్దని తెలియజేశారు. ఆమె ట్వీటుకు స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ‘డియర్ శివాత్మిక.. మీ ప్రియమైన నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మా అందరి ప్రార్థనలు, మద్దతు ఆయనకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి’ అన్నారు.

ఇక తాజాగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందిస్తూ ‘నా సహనటులు, మిత్రులు అయిన రాజశేఖర్‌ మరియు జీవితలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సాయిబాబా దయ వలన వారు ఖచ్చితంగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్లలో పాల్గొంటారు’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. వీరే కాదు సినీ ప్రముఖులు చాలామంది జీవిత, రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్న ఆసుపత్రి వైద్యులు రాజశేఖర్ చికిత్స బాగానే రెస్పాండ్ అవుతున్నారని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

సంబంధిత సమాచారం :