
‘దేశ పరిశుభ్రతే మన అభివృద్ధి’ అనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమం స్వచ్చ భారత్ అభియాన్. ఈ స్వచ్చ భారత్ అభియాన్ ని స్పూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ‘స్వచ్చ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ స్వచ్చ హైదరాబాద్ ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్ ని క్లీన్ గా ఉంచి, దేశం లోని క్లీన్ మెట్రో సిటీస్ లో మన హైదరాబాద్ ని ఒకటిగా చేయడానికి ఈ ప్రోగ్రాం ని స్టార్ చేయనున్నారు.ఈ నెల 16న ప్రారంభమైన ఈ స్వచ్చ హైదరాబాద్ ని తెలంగాణ ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
ఈ స్వచ్చ హైదరాబాద్ కి టాలీవుడ్ కూడా తన సపోర్ట్ ఇవ్వనుందని ఇది వరకే తెలియజేశాం. అందులో భాగంగా ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా కదలి వచ్చి ఈ రోజు ఉదయం స్వచ్చ హైదరాబాద్ ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, రాఘవేంద్ర రావు, సురేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, రాజేంద్ర ప్రసాద్, సందీప్ కిషన్, రాజశేఖర్ – జీవిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి స్వచ్చ హైదారాబాద్ కోసం తమ వంతు కృషి చేస్తాం అని అందరూ ప్రమాణం చేసారు.

