మొత్తానికి అదిరే అప్డేట్ ను ఇచ్చిన “ఆచార్య” టీం..!

Published on Mar 27, 2021 6:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పై అంతే స్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈరోజు మెగా తనయుడు అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి చరణ్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేసారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ ను మొత్తానికి రివీల్ చేశారు. అదే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం.. చిరు మరియు సంగీత దర్శకుడు మణిశర్మ కాంబో అని అనౌన్స్ చేసిన స్టార్టింగ్ లోనే ఒక రకమైన హైప్ ఈ చిత్రంపై ఏర్పడింది. దీనితో ఈ వింటేజ్ కాంబో నుంచి పాటల కోసం కోసం కూడా అంతా గట్టిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ను నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు కన్ఫర్మ్ ఇచ్చేసారు. “లాహె లాహె” అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను చిరు గ్రేస్ స్టెప్ తో ఉన్న పోస్టర్ ద్వారా వచ్చే మార్చ్ 31న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో మెగా ఫాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఎట్టకేలకు వస్తుంది గెట్ రెడీ..

సంబంధిత సమాచారం :