మొత్తానికి బన్నీ ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పటికి షిఫ్ట్ అయ్యింది.!

Published on Mar 20, 2021 7:00 am IST

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంతో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఇంకో పాన్ ఇండియన్ సినిమా కూడా ఉంది. ఇక ఈ రెండే అనుకుంటే మరో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు కూడా రేస్ లోకి వచ్చింది.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నా బన్నీ కు ఎప్పటి నుంచో ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా నార్త్ మరియు ఇతర రాష్ట్రాల్లో మంచి క్రేజ్ నెలకొనడంతో వీటికన్నా ముందే బన్నీ దగ్గరకు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తెచ్చింది శ్రీరామ్ వేణు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అనుకోని పరిస్థితుల రీత్యా ఈ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి జరిగింది. మరి ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఉంది కానీ కాకపోతే పుష్ప నుంచి నీల్ వరకు ఈ మూడు పూర్తయ్యాకే ఈ సినిమా మొదలు కానుందట. ఇలా బన్నీ చెయ్యాల్సి ఉన్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :