బాబు ల్యాండ్ అయ్యేది ఈరోజే.!

Published on Feb 27, 2023 8:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ కాంబినేసన్ లో జస్ట్ అనౌన్సమెంట్ తోనే అంచనాలు పీక్స్ లోకి వెళ్లాయి. పైగా ఇది హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కూడా కావడంతో ముందు ఉన్న వీరి హిట్ ట్రాక్ కి కూడా సంబంధమే లేకుండా అన్ని అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి.

మరి ఈ సినిమాని మహేష్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ కూడా మహేష్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మరి ఇపుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఫైనల్ గా బాబు అయితే ఈరోజు ల్యాండ్ అవ్వనున్నారు.

హైదరాబాద్ లో వేసిన లేటెస్ట్ భారీ సెట్టింగ్ లో అయితే ఈరోజు ఘాటింగ్ స్టార్ట్ కానుండగా మహేష్ ఈ షూట్ లో పాల్గొననున్నారు. అలాగే ఫీమేల్ లీడ్ పూజా మరియు శ్రీ లీల కూడా ఈ షెడ్యూల్ లో ఉంటారని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ అవైటెడ్ సినిమాని ఈ ఆగష్టు లోనే రిలీజ్ చేయానికి మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం :