ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’

ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’

Published on Feb 23, 2023 9:02 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన్న లేటెస్ట్ సక్సెస్ఫుల్ మూవీ వీరసింహారెడ్డి. శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక ఈ మూవీ ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా బాలయ్య డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ నేడు కొద్దిసేపటి క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా డిస్నీ లో అందుబాటులో ఉంది. మరి థియేటర్స్ లో ఆకట్టుకున్న వీరసింహారెడ్డి మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు