ఎట్టకేలకు బన్నీ ఆ ఫీట్ సాధించాడు.

Published on Jan 18, 2020 9:16 am IST

అల వైకుంఠపురంలో మూవీ బన్నీ పేరున అనేక కొత్త రికార్డ్స్ నమోదు చేస్తుంది. బన్నీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం, యూఎస్ లో $ 2 మిలియన్ క్లబ్ హీరోల సరసన చేర్చింది. ఎప్పటి నుండో బన్నీకి అందని ద్రాక్షలా ఉన్న ఈ ఫీట్ అల వైకుంఠపురంలో చిత్రంతో సాకారం అయ్యింది. నైజానికి బన్నీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఉన్న సరైనోడు, రేసు గుర్రం వంటి చిత్రాలు కూడా ఈ మార్కును చేరుకోలేదు. కనీసం $1.5 మిలియన్ మార్క్ కూడా ఆ చిత్రాలు చేరుకోలేకపోయాయి. అల వైకుంఠపురంలో చిత్రం బన్నీకి యూఎస్ లో మార్కెట్ పెరిగేలా చేసింది.

అందుకే బన్నీ చాలా ఖుషీగా ఉన్నారు. రేపు ఆదివారం విశాఖ వేదికగా గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అలాగే 24 న తిరుపతిలో మరో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. బన్నీ చిత్రం మలయాళంలో కూడా విడుదలైన నేపథ్యంలో కేరళ మరియు కర్ణాటకలో కూడా సక్సెస్ మీట్స్ ప్లాన్ చేస్తున్నారు. అల వైకుంఠపురంలో మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించాయి. బన్నీకి జంటగా పూజ హెగ్డే నటించగా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు వంటి వారు కీలక రోల్స్ చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More