ఫైనల్ గా “రామారావు ఆన్ డ్యూటీ” నుంచి అవైటెడ్ బిగ్ అప్డేట్.!

Published on Jun 22, 2022 4:07 pm IST

టాలీవుడ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ స్టార్ హీరోలలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ హీరోగా ఇప్పుడు అనేక చిత్రాల్లో నిర్విరామమగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో నూతన దర్శకుడు శరత్ మందవతో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “రామారావు ఆన్ డ్యూటీ” కూడా ఒకటి. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సాలిడ్ సబ్జెక్టు నుంచి మేకర్స్ ఈరోజు అయితే నిన్న చెప్పినట్టుగానే సాలిడ్ అప్డేట్ ని అందించారు.

నిజానికి ఈ జూన్ 17నే రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రం పలు కారణాల చేత ఆగాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ అయితే మాత్రం ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ పై ఓ బిగ్ అప్డేట్ ని ఒక కొత్త పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా జూలై 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ప్రకటించారు.

మొత్తానికి అయితే రవితేజ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న ఆ బిగ్ డేట్ ఫైనల్ గా వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :