బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ఛావా’ కోసం అందరికీ తెలిసిందే. హిందీ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే సాలిడ్ టాక్ సహా వసూళ్ళని అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి డిమాండ్ సొంతం చేసుకుంది.
మరి ఇలా రెండు భాషల్లో కూడా మంచి హిట్ అయ్యిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది వరకు మేము చెప్పినట్టుగానే అఫీషియల్ డేట్ ఇపుడు వచ్చేసింది. ఛావా ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో రేపు ఏప్రిల్ 11 నుంచి సినిమా వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ డేట్ ఇచ్చేసింది. దీనితో ఈ అవైటెడ్ సినిమా రేపటి నుంచి రానుంది అని చెప్పాలి. అయితే హిందీ మినహా మిగతా భాషల్లో స్ట్రీమింగ్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు.