“జెర్సీ” రీమేక్ కు ఓ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

“జెర్సీ” రీమేక్ కు ఓ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Jan 17, 2021 4:00 PM IST

మన దగ్గర నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఎమోషనల్ ఫెంటాస్టిక్ స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ”. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం హిందీలో కూడా రీమేక్ అయ్యిందన్న సంగతి తెలిసిందే. అక్కడి టాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి నే తెరకెక్కించారు.

మరి ఈ చిత్రం షూట్ కూడా ఈ మధ్యన పూర్తి కాగా షాహిద్ కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు. మరి అక్కడ కూడా భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం విడుదలకు మేకర్స్ ఒక డేట్ ను ఫిక్స్ చేసేసారు. మరి ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారం మేకర్స్ ఈ ఏడాది దీపావళి రేస్ లో విడుదల చేస్తామని ప్రకటించారు.

ఎన్నో అడ్డంకుల్లోనే షూట్ ను పూర్తి చేసుకొని వచ్చే నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల చెయ్యడానికి ఫిక్స్ చేసారు. మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో అన్నది తెలియలేదు కానీ ఈ చిత్రం ఖచ్చితంగా హిందీ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి అలాగే ఈ చిత్రాన్ని హిందీలో దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు