మాసివ్ క్లైమాక్స్ షూట్ తో “కేజీయఫ్ 2” పూర్తయింది!

మాసివ్ క్లైమాక్స్ షూట్ తో “కేజీయఫ్ 2” పూర్తయింది!

Published on Dec 20, 2020 1:05 PM IST

kgf 1

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా భారీ అంచనాలను సెట్ చేసుకున్న పలు పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే పవర్ ఫుల్ విలన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. దీనికి ముందు వచ్చిన చాప్టర్ 1 ఊహలకు అందని రీతి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనిపై కనీ వినీ ఎరుగని రీతి అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా కరోనా సమయంలోనే షూట్ ను స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఈ మధ్యనే హైదరాబాద్ లో క్లైమాక్స్ షూట్ నిమిత్తం వచ్చి నిర్విరామంగా చేశారు. మరి ఇప్పుడు ఫైనల్ గా భారీ క్లైమాక్స్ షూట్ ను పూర్తి చేసినట్టుగా తెలిపారు. ఇక ఈరోజుతో షూట్ ను పూర్తి చేసేసిన మేకర్స్ రేపు డిసెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఒక మాన్స్టర్ అప్డేట్ కూడా ఇస్తున్నామని తెలిపారు. మరి మేకర్స్ వదిలే ఆ అప్డేట్ ఏంటి అన్నది కూడా చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు