టాలీవుడ్‌లో నవంబర్ నెల సినిమాలకు కలిసి రాదనే సెంటిమెంట్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. 2012లో నాగార్జున నటించిన ‘ఢమరుకం’ సాధించిన రూ. 50 కోట్ల వసూళ్లే గత 14 ఏళ్లుగా ఈ నెలలో అత్యధిక రికార్డుగా నిలిచాయి. అయితే, ఎట్టకేలకు గత వారం విడుదలైన ‘ఈఎన్ఈ రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాలు ఆ పాత రికార్డును బద్దలు కొడుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి.
‘ఈఎన్ఈ రిపీట్’ విడుదలైన వారంలోపే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరగా, ‘ఆకాశంలో ఒక తార’ నెమ్మదిగా మొదలై, పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ పుంజుకుంటోంది. నాలుగో రోజు వసూళ్లు పెరగడంతో ఈ చిత్రం కూడా రెండో వీకెండ్ నాటికి రూ. 50 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీటితో పాటు ‘రామాయణం’, ‘సీన్’ వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా రాణించడంతో నవంబర్ ఇకపై అన్‌లక్కీ నెల కాదని రుజువైంది.


