లేటెస్ట్ : ఎన్టీఆర్ 30 ఇక లాంచింగ్ కి రెడీ ?

Published on Mar 16, 2023 2:01 am IST

టాలీవుడ్ స్టార్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో అతి త్వరలో ఎన్టీఆర్ 30 మూవీ ప్రారంభం కాబోతోంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మితం కానున్న ఈ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చనున్న ఈ మూవీ ఫైనల్ గా లాంచింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ మార్చి 23న గ్రాండ్ గా లాంచ్ కానుందని, పలువురు అతిథులు ఈ లాంచింగ్ ఈవెంట్ కి రానున్నారని తెలుస్తోంది. ఇక మూవీ రెగ్యులర్ షూట్ మార్చి 30 నుండి బిగిన్ కానుందట. అలానే అతి త్వరలో దీనిపై యూనిట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. మరి జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత గ్రాండ్ గా రూపొందనున్న ఈ మూవీ ఎంత మేర ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే దీని రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 5, 2024వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :