మాస్ మహారాజా రవితేజ హీరోగా ఆషిక రంగనాథ్ అలాగే డింపుల్ హయాతి కలయికలో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే “భర్త మహాశయులకు”. మాస్ మహారాజ్ గత సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ గా థియేటర్స్ లో పెర్ఫామెన్స్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా డీసెంట్ రన్ ని థియేటర్స్ లో అందుకుంది కానీ ఓటిటిలోకి రావడనికి మాత్రం ఇతర సినిమాలతో పోలిస్తే ఎక్కువ సమయాన్నే తీసుకుంది.
మరి ఫైనల్ గా ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఓటిటి ఆడియెన్స్ ని అలరించడానికి వచ్చేసింది. ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ జీ 5 సొంతం చేసుకోగా వారు ఇవాళ్టి నుంచి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో తీసుకొచ్చారు. సో అపుడు మిస్ అయ్యిన వారు ఇప్పుడు ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
