తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు మరియు కోర్టు వివాదాల కారణంగా గత కొంతకాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుకు కొత్త వెర్షన్‌ను సమర్పించి కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
ఈ పరిణామాలతో అన్ని అడ్డంకులు తొలగి, ఫిబ్రవరి 20న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ‘బుక్‌మైషో’లో మిలియన్ కంటే ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుండగా, ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.121 కోట్లకు, శాటిలైట్ హక్కులను జీ తమిళ్ రూ.64 కోట్లకు సొంతం చేసుకున్నాయి.
మద్రాస్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ వివాదం పరిష్కారమైతే, ఫిబ్రవరి 20న సినిమా థియేటర్లలోకి రావడం ఖాయం. రంజాన్ సీజన్ మరియు ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేయడం ద్వారా భారీ వసూళ్లు సాధించాలని మేకర్స్ భావిస్తున్నారు.


