ఫైనల్ గా “ఫ్యామిలీ మ్యాన్ 2” తెలుగు డబ్ పై క్లారిటీ ఇదే.!

Published on Aug 13, 2021 8:00 am IST


మన ఇండియన్ ఓటిటి హిస్టరీలో కూడా పలు అదిరే వెబ్ కంటెంట్ ఉంది.. మరి వాటిలో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి ఉన్న క్రేజ్ వేరు. రాజ్ అండ్ డీకే లు డైరెక్ట్ చేసిన ఈ ఇంటెన్స్ ఇండియన్ థ్రిల్లర్ డ్రామా రెండే సీజన్స్ గా విడుదల అయ్యి భారీ హిట్ అయ్యింది. మరి రెండో సీజన్ అయితే సమంతా లాంటి స్టార్ క్యాస్టింగ్ పైగా ఓ సాలిడ్ రోల్ తో వచ్చి పర్ఫెక్ట్ సీక్వెల్ గా ఓటిటిలో భారీ హిట్టయ్యింది.

అయితే గత సీజన్ లానే దీనిని కూడా తెలుగులో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ విడుదలైన నెల నాళ్ళు దాటినా కూడా ప్రైమ్ వీడియో వారు ఈ సిరీస్ ని రీజనల్ భాషల్లో రిలీజ్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ మోస్ట్ అవైటెడ్ సిరీస్ తెలుగులో స్ట్రీమ్ అయ్యేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది.

మేకర్స్ ఈ సిరీస్ ని ఈ నెలలోనే తెలుగులో స్ట్రీమింగ్ కి తీసుకొని రావడానికి ఫిక్స్ చేశారట. ఇంకాఆ డేట్ అయితే తెలియరాలేదు కానీ ఈ సిరీస్ మాత్రం తెలుగులో ఈ నెలలోనే అందుబాటులోకి రావడం కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. ఫైనల్ గా మాత్రం ఎన్నో రోజులుగా ఆడియెన్స్ ఎదురు చూపులకి ఇప్పుడు తెరపడ్డట్టు అయ్యింది..

సంబంధిత సమాచారం :