లేటెస్ట్..షారుఖ్, అట్లీల క్రేజీ ప్రాజెక్ట్ అప్పటి నుంచే స్టార్ట్.!

Published on May 26, 2021 4:00 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని గత కొంత కాలం నుంచి తన స్టార్డం కి తగ్గ హిట్ పడలేదు. దీనితో అతని అభిమానులు సహా బాలీవుడ్ సైతం షారుఖ్ బాక్సాఫీస్ స్టామినా మళ్ళీ రుచి చూడాలని కోరుకుంటున్నారు. అయితే ఇపుడు షారుఖ్ మాత్రం స్యూర్ షాట్ హిట్ కాంబోస్ నే సెట్ చేసుకున్నారు.

బాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్ తో “పఠాన్” అనే సాలిడ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం షారుఖ్ చేస్తుండగా ఇదే గ్యాప్ లో కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మరో సాలిడ్ ప్రాజెక్ట్ ఉందని తెలిసింది. దీనితో ఈ సినిమాపై ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమాలో కూడా మంచి అంచనాలు సెట్టయ్యాయి.

మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఎప్పుడు మొదలు కానుందో ఇపుడు సమాచారం తెలిసింది. ఈ చిత్రాన్ని షారుఖ్ అండ్ అట్లీ ఈ ఏడాది చివర్లో స్టార్ట్ చేస్తారట. అప్పటికి సిద్ధార్థ్ తో చేస్తున్న పఠాన్ ని ఫినిష్ చేసేయాలని షారుఖ్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అట్లీ సినిమా తర్వాత బాలీవుడ్ అద్భుత చిత్రాల సృష్టికర్త రాజ్ కుమార్ హిరానీతో ఓ సినిమా కూడా ఉందని టాక్ నడుస్తుంది.

సంబంధిత సమాచారం :