ఈ రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాలకు స్ట్రీమింగ్ డేట్స్..!

Published on Mar 17, 2021 7:06 am IST

ఇటీవల కాలంలో సినిమాల కు సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ డేట్స్ తో పాటుగా ఆ తర్వాత స్ట్రీమింగ్ డేట్స్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా హిట్ సినిమాలు అయితే కాస్త ఎక్కువగానే ఎదురు చూస్తారు. మరి అలా లేటెస్ట్ గా విడుదలైన రెండు సినిమాల తాలూకా స్ట్రీమింగ్ డేట్స్ వినిపిస్తున్నాయి.

ఒకటి మన తెలుగులోనే మొట్ట మొదటి జాంబీ నేపథ్యంలో టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన “జాంబీ రెడ్డి” సినిమా కాగా మరొకటి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి హీరోయిన్ గా విడుదలైన డెబ్యూ చిత్రం “ఉప్పెన”. ఇప్పుడు ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ వినిపిస్తున్నాయి.

మొదటగా ఉప్పెన ఈ మార్చ్ 24న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు ఖరారు కాగా యువ హీరో తేజ సజ్జ నటించిన జాంబీ రెడ్డి ఈ మార్చ్ 26న తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రాల కోసం ఓటిటి వీక్షకులు కాస్త ఎక్కువగానే ఉన్నారు. ఫైనల్ గా ఈ రెండు చిత్రాలు ఈ తేదీలలో రానున్నాయి.

సంబంధిత సమాచారం :