ఒకప్పటి స్టార్ హీరో కుమారుడిపై అత్యాచారం కేస్ నమోదైంది !

ఒకప్పటి స్టార్ హీరో కుమారుడిపై అత్యాచారం కేస్ నమోదైంది !

Published on Jul 3, 2018 2:57 PM IST

Hero

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ఇప్పటి ప్రముఖ నటుడైన మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పై అత్యాచారం కేసు నమోదైంది. ఓ యవతి మహాక్షయ్ పై ఆరోపిస్తూ పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీలోని రోహిణి కోర్టును ఆశ్రయించింది. దాంతో ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు అతనిపై, బెదిరింపులకు పాల్పడ్డ అతని తల్లి పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

కాగా ఆ బాధిత యువతి గత మూడు సంవత్సరాలుగా మహాక్షయ్‌ తో సంబంధం ఉందని ఇద్దరం రోజు ఫోన్లో మాట్లాడుకునే వాళ్లమని చెప్పింది. ఈ క్రమంలోనే మహాక్షయ్ తనను అతని ఫ్లాట్‌ కు తీసుకువెళ్లి బలవంతం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. మహాక్షయ్ తల్లి యోగితా కూడా తనకు ఫోన్ చేసి నన్ను చాలా సార్లు బెదిరించారని ఆ యువతి ప్రధానంగా పిటిషన్‌ లో పేర్కొంది.

తాజా వార్తలు