బీచ్ రోడ్ చేతన్ మొదటి షోకి విశేష స్పందన.

బీచ్ రోడ్ చేతన్ మొదటి షోకి విశేష స్పందన.

Published on Nov 22, 2019 12:10 PM IST

యంగ్ హీరో చేతన్ మద్దినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బీచ్ రోడ్ చేతన్’. నేడు ఈమూవీ తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదలైంది. చేతన్ మద్దినేని ప్రొడక్షన్ బ్యానర్ పై హీరో చేతన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఫాంటసీ స్టోరీ తో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లవ్ యాంగిల్ కూడా ఉందని సమాచారం.

కాగా ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా, అన్ని థియేటర్లో మొదటి షో ప్రేక్షకులకు ఫ్రీ గా ప్రదర్శించారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ ఐయ్యాయని తెలుస్తుంది. ప్రతి ధియేటర్ వద్ద నుండి మూడు నుండి నాలుగొందల మంది టికెట్స్ దొరక్క నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా జిల్లాలో థియేటర్స్ మొదటి షో హౌస్ ఫుల్ బోర్డ్స్ తో నడుస్తున్నాయి. హైదరాబాద్ లో గోకుల్ , సంధ్య థియేటర్ వద్ద ఇదే సందడి కనిపిస్తుంది. చేతన్ మార్కెటింగ్ టెక్నిక్ బాగా వర్క్ అవుట్ ఐయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు