‘రుక్మిణి’గా అలరించబోయేది ఎవరు? స్పెషల్ అప్‌డేట్‌తో రివీల్ కానున్న సుందరి.. ఎప్పుడంటే..?

‘రుక్మిణి’గా అలరించబోయేది ఎవరు? స్పెషల్ అప్‌డేట్‌తో రివీల్ కానున్న సుందరి.. ఎప్పుడంటే..?

Published on Oct 13, 2026 1:01 AM IST

న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో సినిమాలోని మోస్ట్ బ్యూటిఫుల్ ‘రుక్మిణి’ పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.

ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో నటించబోతున్న ఆ సుందరి ఎవరనేది రేపు(అక్టోబర్ 13) సాయంత్రం 5:49 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించి రేపు విడుదల కాబోయే ‘రుక్మిణి’ అప్‌డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాతో నితిన్ ఈసారి సాలిడ్ హిట్ అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమాలో రుక్మిణిగా అలరించబోతున్న ఆ బ్యూటీ ఎవరో చూడాలి.

తాజా వార్తలు