ధనుష్ సినిమాను యష్ చేస్తున్నాడా.. డైరెక్టర్ చెప్పిన కథ ఒకటేనా..?

ధనుష్ సినిమాను యష్ చేస్తున్నాడా.. డైరెక్టర్ చెప్పిన కథ ఒకటేనా..?

Published on Oct 13, 2026 2:02 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్, తమిళ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో ఓ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనుందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ మొదట ధనుష్‌ కోసం ప్లాన్ చేసినదేనని, ఇప్పుడు ఆయన స్థానంలో యష్‌ వచ్చాడనే ప్రచారంపై కొంత గందరగోళం నెలకొంది. దీనిపై క్లారిటీ కావాలని అభిమానులు కోరుతున్నారు.

పీఎస్ మిత్రన్ గతంలోనే ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఒక అడ్వెంచర్ కథను యష్‌కు వినిపించాడట. ఆ సమయంలో డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు యష్ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ ఆలోచనను మళ్లీ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ కన్‌ఫ్యూజన్‌కు ప్రధాన కారణం.. పీఎస్ మిత్రన్, ధనుష్ కాంబినేషన్‌లో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో వస్తోందని ప్రచారంలో ఉన్న మరో హిందీ సినిమానే. కరీనా కపూర్ ఖాన్ కూడా నటించనున్న ఈ మైథలాజికల్ జంగిల్ అడ్వెంచర్ మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయని మిత్రన్ ఇదివరకే స్పష్టం చేసినప్పటికీ, అది ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు మిత్రన్ పేరు యష్‌తో మరో అడ్వెంచర్ సినిమాకు ముడిపడటంతో హీరో మారాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు