28 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఎన్టీఆర్ ‘విలన్’ !

28 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఎన్టీఆర్ ‘విలన్’ !

Published on Feb 28, 2019 8:18 PM IST

నవీన్ చంద్ర హీరోగా 28 డిగ్రీల సెంటీగ్రేడ్ అనే సినిమా రాబోతుంది. న‌వీన్ చంద్ర‌, షాలిని, వ‌డ్నిక‌ట్టి హీరో హీరోయిన్‌గా వీరాంజ‌నేయ ప్రొడ‌క్ష‌న్స్‌, రివ‌ర్ సైడ్ సినిమాస్ ప‌తాకాల‌పై డా.అనీల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ సాయి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం 28°c. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా విడుద‌ల‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత అభిషేక్ సాయి మాట్లాడుతూ – 28°c అనే టైటిల్ అంద‌రిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. న‌వీన్‌ చంద్ర‌కు ఈ సినిమాతో మంచి హిట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. అనీల్ విశ్వ‌నాథ్‌గారు స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించారు. శ‌్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు