“ఫస్ట్ ర్యాంక్ రాజు” ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్..

Published on Jun 12, 2019 12:49 pm IST

చేతన్ మద్దినేని, కాషిక్ వోహ్రా హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సెటైరికల్ కామెడీ డ్రామా “ఫస్ట్ ర్యాంక్ రాజు”.ఇది 2015 లో ఇదే పేరుతో వచ్చిన కన్నడ మూవీకి తెలుగు అనువాదం. ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన నరేష్ కుమార్, తెలుగు అనువాదంకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ర్యాంకుల వేటలో విద్యార్థులు సామజిక అంశాలపై,సంప్రదాయాలపై కనీస అవగాహన లేకుండా పెరిగితే జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవతాయో సెటైరికల్ గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం.

ఇప్పటికే “ఫస్ట్ ర్యాంక్ రాజు” టీజర్ రిలీజ్ చేసిన నిర్మాతలు ఈనెల 14న మూవీ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం,నరేశ్,ప్రియదర్శి,వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో కనిపించనున్న ఈ మూవీ మంజునాథ్ నిర్మిస్తుండగా,కిరణ్ రవీంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. ఈనెల 21న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More