‘ఏమో ఏమో ఏ గుండెల్లో’ వచ్చిన ‘ఎంత మంచివాడవురా’ !

Published on Dec 8, 2019 3:38 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రమోషన్లలో భాగంగా మొదటి పాట ‘ఏమో ఏమో ఏ గుండెల్లో’ను ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ చేశారు. పాట మనిషి ఎలా బతకాలి అనే కోణంలో గొప్ప అర్ధవంతమైన ఆలోచనలతో సాగింది.

ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించడం జరిగింది. అందుకే పాటపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More