నందమూరి హీరో మొదటి పాట వినిపించేస్తాడట..!

Published on Dec 1, 2019 2:05 pm IST

ఈ సారి సంక్రాంతికి నందమూరి కుటుంబం నుండి కళ్యాణ్ రామ్ బరిలోకి దిగుతున్నాడు. ఆయన నటిస్తున్న ఎంత మంచివాడవురా మూవీ వచ్చే ఏడాది జనవరి 15న విడుదలకు సిద్ధమైంది. బడా హీరోలకు పోటీగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కళ్యాణ్ రామ్ రావడం విశేషం. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక విడుదలకు కేవలం నెలన్నర సమయం మాత్రమే ఉండటంతో ప్రొమోషన్స్ పై ద్రుష్టి సారించారు

ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ ని ఈనెల 6వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఫీల్ గుడ్ ఫ్యామిలీఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలోని సాంగ్స్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించడం కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ కావడానికి ఒక కారణం. ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

సంబంధిత సమాచారం :

More