నలుగురు అమ్మాయిలతో రొమాంటిక్ గా మై లవ్ సాంగ్.

Published on Jan 20, 2020 4:08 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. దర్శకుడు క్రాంతి మాధవ్ ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. నలుగురు యువతులను ప్రేమించే యువకుడిగా విజయ్ దేవరకొండ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. రాశి ఖన్నా, క్యాథరిన్ థెరిస్సా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి నేడు మై లవ్… అనే ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

నలుగురు అమ్మాయిలతో విజయ్ ప్రేమ కథను చూపిస్తూ సాంగ్ చాల మెలోడియస్ గా సాగింది. కొంచెం వెస్ట్రన్ టచ్ తో రొమాంటిక్ గా సాగిన ఈ సాంగ్, మూవీ నేపథ్యంలో ఆహ్లాదంగా నడుస్తుందనిపిస్తుంది. మిగిలిన ముగ్గురు హీరోయిన్లు విజయ్ గర్ల్ ఫ్రెండ్స్ గా కనిపిస్తుండగా ఒక్క ఐశ్వర్యా రాజేష్ మాత్రమే భార్యగా నటించింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సాంగ్స్ అందిస్తున్నారు.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More