ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ నుండి ఫస్ట్ సాంగ్ విడుదల కానుంది !

Published on Dec 1, 2018 9:39 am IST

సీనియర్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈచిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారని తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ చిత్రంలోని మొదటి భాగం ‘కథానాయకుడు’ నుండి ‘కథానాయక’ అంటూ సాగే టైటిల్ ట్రాక్ ని రేపు ఉదయం 7:42 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ కథనాయకుడు వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకానుండగా రెండవ భాగం ‘మహానాయకుడు’ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రిష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో బాలకృష్ణ కు జోడిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :