బాక్సాఫీస్ దగ్గర సినిమాలు పోటీ పడటం మనం చూస్తుంటాం. అయితే, ఒకటి లేదా రెండు భాషల చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం కామన్. కానీ, ఈ వేసవి సీజన్‌ను ఏకంగా ఐదు భాషల చిత్రాలు ఒకే రోజున పోటీపడనున్నాయి. దీంతో ఈ సమ్మర్ ఫైట్ ఏయే సినిమాల మధ్య ఉందా అని సినిమా లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
మే 1న తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హిట్-3’ రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమయ్యింది. ఇక హిందీలో అజయ్ దేవ్గన్ నటిస్తున్న ‘రైడ్-2’ సినిమా కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా కూడా మే 1న రానుంది. మౌనీ రాయ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘ది భూత్నీ’ కూడా అదే రోజు రానుంది.
ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ కూడా సమ్మర్ పోటీని స్టార్ట్ చేయనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే మరో తమిళ సినిమా కూడా అదే రోజున రానుంది. మలయాళ నటుడు ఆసిఫ్ అలీ నటిస్తున్న ‘అభ్యంతరకుట్టావలి’ మూవీ కూడా మే 1న రానుంది.
ప్రముఖ హాలీవుడ్ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న సూపర్ హీరో మూవీ ‘థండర్‌బోల్ట్స్’ కూడా మే 1న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇలా మే 1న ఏకంగా 5 భాషల చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. మరి ఈ సినిమాల్లో ప్రేక్షకుల ఓటు దేనికి ఉంటుందో చూడాలి.