వరుసగా ఐదు ప్లాప్ ల తరువాత ఊరటనిచ్చిన విజయం !

Published on Jan 20, 2019 11:00 pm IST

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై గ్లామరస్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. నాని సరసన ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో నటించిన మెహ్రీన్ పెద్దగా హావభావాలతో మెప్పించలేకపోయినా.. తన అందచందాలతో బాగానే మెస్మరైజ్ చేసింది. దానికి తోడు మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుని టాలీవుడ్ లోనే క్రేజీ హీరోయిన్ గా మారింది. దాంతో ఆమెకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి.

ఇక టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరుతుందనుకున్నే లోపు, కేరాఫ్ సూర్య, పంతం, జవాన్, నోటా, కవచం ఇలా వరుసగా ఐదు డిజాస్టార్స్ ను తన ఖాతాలో వేసుకుని ఐరన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది, పాపం మెహ్రీన్. దాంతో ఇక మెహ్రీన్ కెరీర్ అంతా ముగిసిపోయిందనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ‘నోటా’లో ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రను ఇచ్చారు. ఇలాంటి టైంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’లో మెహ్రీన్ కు హాని పాత్రని ఇచ్చి ఆమె కెరీర్ కు మళ్లీ జీవం పోశాడనే చెప్పాలి.

అయితే పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేదని బలంగా పేరు ఉన్న మెహ్రీన్ ‘ఎఫ్ 2’లో మాత్రం తన లవ్లీ పెర్ఫార్మెన్స్ తో చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా లవర్ ని ఇబ్బందులకు ఫ్రస్ట్రేషన్ కి గురి చేసే పెత్తనం గల అమ్మాయిగా, హాని పాత్రలో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో మళ్లీ మెహ్రీన్ కి కెరీర్ ఊపందుకోనుంది.

సంబంధిత సమాచారం :